Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ లక్షలాది యాడ్స్‌ను బ్యాన్ చేస్తున్న గూగుల్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:11 IST)
ఆన్‌లైన్ వినియోగదారుల భద్రతను ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. వినియోగదారులకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ఎటువంటి అంశాలను అయినా గూగుల్ నిషేధిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో 2018లో వినియోగదారులకు హాని కలిగించే ఉద్దేశంతో ప్రదర్శించబడిన కొన్ని కోట్ల వ్యాపార ప్రకటనలను నిషేధించినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది.
 
గతేడాది రోజుకు కనీసం 6 లక్షల వ్యాపార  ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ప్రదర్శించబడ్డాయని, వాటన్నింటినీ నిషేధించామని పేర్కొంది. 2018లో మొత్తంగా 230 కోట్ల ప్రకటనలను ఇంటర్నెట్ నుండి నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. 2018 ఏడాది బ్యాడ్ యాడ్ రిపోర్ట్‌లో గూగుల్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రతి వినియోగదారుని భద్రతకు, వారికి స్థిరమైన ప్రకటనలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని గూగుల్ తెలియజేసింది.
 
అంతేకాకుండా గూగుల్ ఇప్పటి వరకు 7,34,000 మంది యాడ్ డెవలపర్స్, ప్రచురణకర్తలను యాడ్ నెట్‌వర్క్ నుండి నిషేధించింది. వినియోగదారుల భద్రతకు ముప్పును కలిగించే 1.5 మిలియన్ల అప్లికేషన్‌లను కూడా తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్

Varun: సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా చేయాలి : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments