Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ నుండి మరో కొత్త యాప్... బోలో

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (11:10 IST)
ఆన్‌లైన్ ప్రపంచంలో మరొక కొత్త యాప్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజంగా పేరుపొందిన గూగుల్ ఈసారి చిన్నారుల కోసం ఒక కొత్త యాప్‌తో ముందుకొచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్‌ దిగ్గజం​ గూగుల్‌  ఇండియా చిన్నారులకు హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్పే యోచనతో మరో కొత్త యాప్‌ని విడుదల చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 'బోలో' పేరుతో రిలీజ్‌ చేయబడిన ఈ యాప్‌ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్‌-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్‌ వెల్లడించింది. 
 
ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు  నేర్పించడం వంటివి చేస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్‌ ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ యాడ్‌ ఫ్రీ గూగుల్‌ బోలో​ యాప్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం. 
 
గూగుల్ ఈ యాప్‌ను యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌ సెంటర్‌ సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరిగడాన్ని గుర్తించినట్లు తెలిపింది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో  చదివే ఆసక్తి, నైపుణ్యం  పెరుగుతుందనే ధీమాను వ్యక్తంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments