Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్లకు డేంజర్ యాప్స్ ఇవే... ఆ రెండు వద్దనే వద్దు...

చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో ట్రూ కాలర్‌, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్స్‌‌ను డౌన్‌లోడ్ చేసుకుని వుంటారు. చైనాకు చెందిన ఈ యాప్స్ వల్ల ప్రమాదం పొంచివుందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (08:54 IST)
చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో ట్రూ కాలర్‌, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్స్‌‌ను డౌన్‌లోడ్ చేసుకుని వుంటారు. చైనాకు చెందిన ఈ యాప్స్ వల్ల ప్రమాదం పొంచివుందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తక్షణం ఈ తరహా యాప్స్‌ను స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగించాలని కేంద్ర హోం శాఖ అడ్వైజరీని జారీ చేసింది. మొత్తం 42 చైనా యాప్‌లతో భారత భద్రతా వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టంచేశాయి. ఈ యాప్‌లు ఫోన్‌లలోని సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయని తెలిపాయి. 
 
ఆర్మీ, భద్రతా దళాల సిబ్బంది వాడే ఫోన్లలో ఈ యాప్‌లు ఉంటే.. దేశ భద్రతకే ప్రమాదమని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా యాప్‌లను మొబైల్‌ ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యం, పారా మిలటరీ బలగాలకు కేంద్రహోంశాఖ అడ్వైజరీని జారీచేసింది. ఇలాంటి యాప్‌లు, ఫోన్లు వాడడం వలన సున్నితమైన సమాచారం చైనా చేతిలోకి వెళ్లే అకాశముందని పేర్కొంది. కేంద్రం తొలగించాలని పేర్కొన్న యాప్‌ల జాబితాలో యాంటీ వైరస్‌, వెబ్‌బ్రోజర్స్‌ వంటివి కూడా ఉన్నాయి. 
 
అలాగే, మొబైల్ టెక్నాలజీలో అత్యంత ప్రమాదకరమైన యాప్స్‌ను కొన్నింటిని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ యాప్స్‌తో చాలా ప్రమాదకరమని తెలిపింది. వాటిలో వీబో, వి చాట్‌, షేర్‌ఇట్‌, ట్రూకాలర్‌, యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌, ఎంఐ స్టోర్‌, ఎంఐ వీడియో కాల్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లీన్‌మాస్టర్‌, 360 సెక్యూరిటీ, డియు రికార్డర్‌, డియు ప్రైవసీ, డియు బ్రౌజర్‌, డియు క్లీనర్‌, డియు బ్యాటరీ సేవర్‌, వైరస్‌ క్లీనర్‌ పర్‌ఫెక్ట్‌ కార్ప్‌ సీఎం బ్రౌజర్‌, బ్యూటీ ప్లస్‌, న్యూస్‌ డాగ్‌, వివా వీడియో-క్యూయూ వీడియో, యు క్యామ్‌ మేకప్‌, ఫొటో వండర్‌, ప్యారెలల్‌ స్పేస్‌, క్యాచి క్లీనర్‌, వాల్ట్‌హైడ్‌, వండర్‌ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్‌ మాస్టర్‌, వి సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, బైడు ట్రాన్స్‌లేట్‌, బైడు మ్యాప్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్‌, క్యూక్యూ ప్లేయర్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంచర్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments