విండోస్ 10 మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిపివేత...

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (18:15 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 మొబైల్స్‌ కథ ముగిసిపోయింది. ఈ మొబైల్స్‌కు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించబోమని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్లకు చివరి అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ డిసెంబర్ 10న విడుదల చేసింది. 
 
అందులో పలు సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉన్నాయి. అయితే విండోస్ 10 మొబైల్‌లో వాడే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర ఆఫీస్ యాప్స్‌కు 2021 జనవరి 12వ తేదీ వరకు సపోర్ట్ ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ క్రమంలో ఆ తేదీ లోగా విండోస్ 10 మొబైల్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్లను మార్చాల్సి ఉంటుంది.
 
ఇదిలావుంటే, గత 2015లో నవంబరు నెలలో మొదటిసారిగా విండోస్ 10 మొబైల్ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దెబ్బకు ఆ ఓఎస్ నిలబడలేకపోయింది. దీంతో 2017లో విండోస్ 10 మొబైల్ ఓఎస్ డెవలప్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇక ఇప్పుడు చివరి అప్‌డేట్‌ను ఆ ఓఎస్ కోసం మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. దీంతో ఆ మొబైల్స్ కథ ఇక ముగిసినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: తలైవర్ 173 చిత్రం పేరు ధర్మన్ - 4గురు దర్శకులు మారారన్న రజనీకాంత్

Kleenkara : నాన్న అని పిలిచే.క్లీంకార పెద్ది విడుదలయ్యాక పెద్ది అని పిలుస్తోంది : రామ్ చరణ్

Chiranjeevi proud: ప్రధాని కలవడం అక్కడ న్యూ ఏజ్ మెగాస్టార్ టైటిల్ ఇవ్వడం తండ్రిగా గర్వంగా వుంది

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

తర్వాతి కథనం
Show comments