Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో స్మార్ట్ ఫోన్‌లోని టాప్ ఫీచర్లివే... ఆగస్టు 24 నుంచి ప్రిబుకింగ్స్

జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆ ఫోన్ ప్రత్యేకతలను స్వయంగా వివరించారు. వచ్చే ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (12:24 IST)
జియో నుంచి సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆ ఫోన్ ప్రత్యేకతలను స్వయంగా వివరించారు. వచ్చే ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆనాటి నుంచి ఏ ఒక్కరూ వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని, ఉచితంగా ఎన్ని నిమిషాలైనా, గంటలైనా మాట్లాడుకోవచ్చని ప్రకటించారు.
 
అన్ని జియో అప్లికేషన్లు ముందుగానే ఇందులో లోడ్ చేసి ఉంటాయని, జియో సినిమా, జియో మూవీ, జియో టీవీ యాప్స్‌తో పాటు వాయిస్ కమాండ్, ప్రాంతీయ భాషల్లో సందేశాలు పంపుకునే వీలు కూడా ఉంటుందని తెలిపారు. అలాగే, నచ్చిన పాటను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చన్నారు. 
 
ఫోన్‌లో 5వ నంబర్ ఎమర్జెన్సీ బటన్‌గా పని చేస్తుందని, ఎమర్జెన్సీ లొకేషన్‌ను షేర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకతని ముఖేష్ పేర్కొన్నారు. 4జీ ఫీచర్ ఫోన్‌లో నెలకు కేవలం రూ.153కు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తామని, వాయిస్ కాల్స్ ఎన్ని చేసుకున్నా ఉచితమేనని, ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితమని ముఖేష్ తెలిపారు. ఈ ఫోన్‌ను ఆగస్టు 24వ తేదీ ప్రిబుకింగ్స్ ప్రారంభిస్తామని, సెప్టెంబరులో ఫోన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. 
 
ఈ అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయన ప్రకటించారు. అయితే ఉచితాన్ని మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దీనిని మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అంబానీ స్ప‌ష్టంచేశారు. 4జీ ఎల్‌టీఈ ఫోన్ మొత్తం వాయిస్ క‌మాండ్స్‌తోనే ప‌ని చేస్తుంది. ఫోన్ చేయాల‌న్నా.. మెసేజ్ పంపాల‌న్నా.. జియో యాప్స్‌ను యూజ్ చేయాల‌న్నా అన్నీ వాయిస్ క‌మాండ్స్‌తోనే ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. దేశంలోని అన్ని భాష‌ల‌ను ఈ ఫోన్ అర్థం చేసుకుంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments