Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వెబ్ సైట్‌ను ప్రారంభించిన టెలికాం రంగ సంస్థ.. మీ పేరు మీద ఎన్ని నెంబర్లున్నాయో..?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (11:31 IST)
టెలికాం రంగ సంస్థ కొత్త వెబ్ సైట్‌ను రూపొందించింది. మనపేరు మీద మనకు తెలియకుండా ఫోన్ నెంబర్లు వుంటే ఈ వెబ్ సైట్ ద్వారా తొలగించే అవకాశం వుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు టెలికంశాఖ అధికారులు. 
 
ఎవరైనా నంబర్ల గురించి చెక్ చేసుకోవాలనుకుంటే.. వెంటనే http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు, దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. 
 
వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ రవి తెలిపారు. 
 
కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పెట్టొచ్చన్నారు. 
 
ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని.. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవచ్చంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments