Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్

వినూత్న మార్పులతో దూసుకుపోతున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీడియో కాలింగ్, జిప్ షేరింగ్ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరు

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (12:09 IST)
వినూత్న మార్పులతో దూసుకుపోతున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీడియో కాలింగ్, జిప్ షేరింగ్ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్ గ్రూప్ చాట్‌లో లైవ్ లొకేషన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
 
పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం వాట్సాప్ గ్రూపులో లైవ్ లోకేషన్‌ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకోసం "ఫర్ మై ఫ్రెండ్స్" అనే ఆప్షన్‌ను చేర్చనున్నారు.
 
దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్ధేశించుకునే వీలు కల్పిస్తున్నారు. స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు దారి తేలిక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ సదుపాయం పనికొస్తుంది.  మరికొద్దిరోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments