Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్: ఇకపై ఫాంట్ ఈజీగా మార్చుకోవచ్చు..

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఇకపై ఫాంట్ స్టైల్‌ను సులభంగా మార్చుకునే వీలుంటుంది. వాట్సప్‌కు నెటిజన్ల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ కొత్త కొత్త అప్‌డేట్లను అందిస్తోంది. ఇ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (12:49 IST)
వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఇకపై ఫాంట్ స్టైల్‌ను సులభంగా మార్చుకునే వీలుంటుంది. వాట్సప్‌కు నెటిజన్ల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ కొత్త కొత్త అప్‌డేట్లను అందిస్తోంది. ఇటీవల ఎమోజీ సేవను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఎమోజీలో కొత్త అప్‌డేషన్‌ను ప్రవేశపెట్టింది. మనకు ఏం కావాలో దాన్ని టైప్ చేస్తే మనకు కావాల్సిన ఎమోజీలు ఓపెన్ అవుతాయి. 
 
అందులో మనకు కావాల్సిన ఎమోజీని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఎమోజీని ఫాంట్ స్టైల్లోనూ మార్చుకోవచ్చు. వినియోగదారులకు అనువుగా కొత్త కొత్త అప్ డేట్లను అమల్లోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. ఫాంట్ స్టైల్, ఎమోజీ లేటెస్ట్ వర్షన్, ఫీచర్స్ కోసం వాట్సాప్ 2.17.148 ద్వారా లభిస్తాయి. ఫాంట్ స్టైల్ బోల్డ్, ఇటాలిక్‌, స్ట్రైక్ థ్రూ, మోనోస్పేస్ వంటివి అందుబాటులో ఉన్నాయని.. ఇందులో ఏ స్టైల్ కావాలో జస్ట్ ట్యాప్ చేస్తే చాలునని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
 
అలాగే కీ వోర్డ్స్ ద్వారా సెర్చ్ చేస్తే ఎమోజీలు ఈజీగా లభిస్తాయి. ఎలాగంటే.. పిగ్ (pig) అని టైప్ చేస్తే పిగ్గీ ఎమోజీ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ను భారత్‌లో 200 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments