Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. రిపోర్ట్ చేయొచ్చు.. కానీ ఆధారాలుండాలి

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (19:48 IST)
మెసేజింగ్ యాప్‌లో అగ్రగామి అయిన వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఏదైనా వాట్సాప్ అకౌంట్ నుంచి వేధింపులు ఎదురవుతున్నా, వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్ లేదా గ్రూప్‌ స్పామ్‌ అనిపించినా వాట్సాప్‌కు రిపోర్ట్ చెయ్యొచ్చు. అయితే మీ రిపోర్ట్‌తో పాటు కొన్ని ఆధారాలను మీరు వాట్సాప్‌కు చూపించాల్సి ఉంటుంది. అంటే ఏ వాట్సాప్ అకౌంట్‌పై మీరు ఫిర్యాదు చేశారో ఆ యూజర్‌తో జరిగిన ఛాటింగ్‌ను సాక్ష్యంగా వాట్సాప్‌కు చూపించాలి. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ఐఓఎస్‌ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. ఇప్పటికే వాట్సాప్‌లో మనకు తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వస్తే దాన్ని బ్లాక్‌ చేయడంతో పాటు రిపోర్ట్ చేసే సౌకర్యం ఉంది. తాజా అప్‌డేట్‌లో రిపోర్ట్‌తో పాటు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
 
అంటే మీరు ఏదైనా అకౌంట్ గురించి రిపోర్ట్ చేసిన తర్వాత ఆ యూజర్‌ లేదా గ్రూప్‌తో జరిగిన రీసెంట్ మెసేజెస్‌ వాట్సాప్‌కు ఫార్వార్డ్ అవుతాయి. ఇందుకు మీ అనుమతి కోరుతూ స్క్రీన్‌ మీద మెసేజ్‌ కనిపిస్తుంది. అందులో రిపోర్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు రిపోర్ట్ చేసిన యూజర్‌తో జరిగిన రీసెంట్ మెసేజ్‌లు వాట్సాప్‌కు చేరిపోతాయి. వాటిని పరిశీలించి మీ ఆరోపణలు నిజమైతే సదరు యూజర్‌ అకౌంట్‌పై చర్యలకు ఉపక్రమిస్తుంది.
 
అయితే ఒక అకౌంట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేముందు వాట్సాప్‌ మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుది. ఇప్పటి వరకు సదరు యూజర్‌పై ఎంతమంది ఫిర్యాదు చేశారు. ఒక వేళ యూజర్‌ వాట్సాప్‌ను కొత్తగా ఉపయోగిస్తున్నారా.. నిజంగా సదరు అకౌంట్‌ నుంచి అభ్యంతరకరమైన రీతిలో ఛాటింగ్ జరుగుతుందా వంటి పలు అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments