Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమి సేల్స్ అదుర్స్.. నాలుగు మిలియన్ ఫోన్లు అమ్ముడుపోయాయ్

దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షియోమీతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఆఫర్లు వెల్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (12:57 IST)
దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షియోమీతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీపావ‌ళి పండ‌గ సీజ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా నాలుగు మిలియ‌న్ల‌కు పైగా షియోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయ‌ని సంస్థ తెలిపింది. 
 
ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ అమ్మకాల్లో షియోమీ బ్రాండ్ నెంబర్ వన్‌గా నిలిచిందని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌ను కుమార్ జైన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19 వరకు దివాలీ సేల్స్ పీరియడ్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. 
 
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ల‌తో పాటు ఇత‌ర స్టోర్ల‌ ద్వారా నాలుగు మిలియ‌న్ల షియోమి ఫోన్లు అమ్ముడుపోయాయని మను కుమార్ చెప్పుకొచ్చారు. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక స్మార్ట్‌ఫోన్ కంపెనీ తమదేనని.. ఈ సందర్భంగా ఎమ్ఐ ఫ్యాన్సుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్‌ను షేర్ చేయండి... ఎమ్ఐ ఏ1 ఫోన్ గెలుచుకోండని జైన్ పోస్ట్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments