Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌‌లో కొత్త ఫీచర్.. యాప్ ద్వారా వీడియోలు పంచుకోవచ్చు

యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:37 IST)
యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది.

ఇంతకుముందులా వీడియోలను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే పంచుకునే వీలుండేది. కానీ త్వరలో అందించే అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
 
వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేసినట్లు యూట్యూబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ఇకపై యూట్యూబ్‌ వీడియోలను నేరుగా మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో యూట్యూబ్‌ యాప్‌లోనే పంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఆ వీడియో గురించి యాప్‌లోనే చర్చించుకోవచ్చని తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil : లెనిన్ తో వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని

Anupama Parameswaran: పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో క్రేజీ కల్యాణం రాబోతోంది

Suriya: విశ్వనాథ్ & సన్స్ ప్రీమియర్లకు ప్లాన్, 30 కోట్ల శాటిలైట్ హక్కుల కోసం చర్చలు

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

తర్వాతి కథనం
Show comments