ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోందా? అయితే ఇలా చేయండి

Webdunia
గురువారం, 14 మే 2020 (18:38 IST)
కరోనాను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఐటి ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు(వర్క్ ఫ్రమ్ హోమ్). ఇంటి నుంచే పనిచేయడం కోసం వీరందరూ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై ఆధారపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసుకుని వాడుతున్నారు. 
 
ఎక్కువ సమయంపాటు ల్యాప్‌టాప్‌ను వాడటం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతుంది. అలా కాకుండా బ్యాటరీని ఆదా చేసుకోవాలనుకుంటే, క్రింద పేర్కొన్న సూచనలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం.
 
* మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే బ్యాటరీ అధిక భాగం ఆదా అవుతుంది.
 
* ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోవాలి.
 
* ల్యాప్‌టాప్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి. వీలైతే కూలింగ్ ప్యాడ్‌లను ఉపయోగించండి.
 
* స్క్రీన్‌సేవర్‌లను పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఇది బ్యాటరీని అదనంగా ఉపయోగించుకుంటుంది.
 
* ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
 
* ల్యాప్‌టాప్‌పై చేయవలసిన పనులను వీలైనంత త్వరగా ముగించుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కువసేవు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి : సురేఖ వాణి కుమార్తె

Nikhil నిఖిల్ హిస్టారికల్ యాక్షన్ స్వయంభు టీజర్ రాబోతోంది

ఆల్ఫా చిత్రంతో సరిపడే వినోదాన్ని అందిస్తాం : హీరో హేమంత్ కుమార్

Indraja: ఇంద్రజ కీలక పాత్రలో విప్లవ వీరుడు షూటింగ్ ప్రారంభం

తిరుమల లడ్డూలో ఒక్క పర్సెంట్ కూడా నెయ్యి లేదు: నటి మాధవీ లత వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

తర్వాతి కథనం
Show comments