వారికి ధైర్యాన్ని నేర్పించడం ఎలా..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:47 IST)
అమ్మగా మీ పిల్లలకు ప్రేమానురాగాలు తప్పకుండా పంచాలి. వాటితో పాటు వారిలో మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయాలంటున్నారు వైద్యులు. ఆనందంగా ఉండాలంటే.. మనసుకు నచ్చిన పనిచేయాలి. పిల్లలకు అది అలవాటు చేయాలంటే.. వారికి ఇష్టమైన అభిరుచిలో శిక్షణ ఇప్పించాలి. అది వారికి ఓ వ్యాపకంగా మాత్రమే కాకుండా.. ఇష్టమైన పనిని చేస్తున్నామనే సంతోషం కలిగిస్తుంది.
 
ఎప్పుడూ పిల్లలు ఆశావహా దృక్పథంతోనే ముందుకు సాగేలా చూడాలి. అది సాధ్యం కావాలంటే.. నువ్వు ఏదైనా చేయగలవు ప్రయత్నించి చూడు అనాలే తప్ప.. నీ వల్ల కాదు అని మాత్రం పిల్లలకు చెప్పకూడదు. పిల్లలకు వీలున్నప్పుడల్లా కథలు చెప్పాలి. కుదిరితే కేవలం విజయ గాథలే కాదు.. అపజయాలు ఎలా ఉంటాయో.. వాటి నుండి ఏం నేర్చుకోవాలనేది నేర్పించాలి.
 
కొందరు చిన్నారులు చిన్నచిన్న వాటికే భయపడుతుంటారు. మీ పిల్లలు కూడా దీనికి మినహాయింపు కాకపోతే వారికి భయానికి కారణం తెలుసుకుని దానినుండి ఎలా అధికమించొచ్చో నేర్పించాలి. అప్పుడే భవిష్యత్తులో వారికి ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితిని తట్టుకుని ముందుకు వెళ్లగలుగుతారు. చిన్నతనం నుండి వాళ్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు ఎదిగేకొద్దీ ఇతరులపై ఆధారపడకుండా ఉండగలుగుతారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పులివెందుల పోకిరీలకు పోలీస్ ట్రీట్మెంట్... సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పేరుతో తగిన శాస్తి చేశారు...

ఉద్యోగినులకు గొడ్డు మాంసం తినిపించి... లైంగిక వేధింపులు.. ఎక్కడ?

ఆ గ్రామంలో అసభ్య పదజాలంతో దూషిస్తే వీధులను శుభ్రం చేయాల్సిందే...

బాలుడిపై లైంగిక దాడి... గొంతు కోసి చంపేశారు.. ఎక్కడ?

ఉచితాలు సరే... వాటి అమలుకు నిధులు ఎలా? వెంకయ్య నాయుడు ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి, రూ. 600 ఆసుపత్రి బిల్లు కట్టలేక అక్కడే మృతదేహం

Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్

Mangli case: మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - వేణు ఊడుగుల

Rashmika: విజయ్, రశ్మికకు సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన రణబాలి మేకర్స్

తర్వాతి కథనం
Show comments