నేను నీ అమూల్యమైన వజ్రాన్ని.... నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని

ప్రియా.... నేను నీ అమూల్యమైన వజ్రాన్ని నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని నేను నీకు అత్యంత సంతోషాన్ని నేనే నీ గుండెలు పిండేసి దుఃఖాన్ని

Webdunia
మంగళవారం, 31 మే 2016 (22:11 IST)
ప్రియా....
 
నేను నీ అమూల్యమైన వజ్రాన్ని
నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని
నేను నీకు అత్యంత సంతోషాన్ని
నేనే నీ గుండెలు పిండేసి దుఃఖాన్ని
 
నేను నీ తీపి గుర్తును
నేనే నీకు చేదు నిజాన్ని
నేను నీ హృదయ సవ్వడిని
నేనే నీ గుండెల్లో భారాన్ని
 
నీ కంటిపాపలో నేనే
నీ కంటిలో నలుసునూ నేనే
నీ తీయనైన కలను నేను
నీ ఉలికిపాటు నిద్రనూ నేనే
 
నేను నీ వెన్నెల వెలుగును
నేనే నీకు అమవాస్య చీకటిని
నేను నీ ఆనందాల హరివిల్లును
నేనే నీ పొదరిల్లులో లేని కిరణాన్ని
 
నేను శీతాకాలపు వెచ్చదనాన్ని
నేనే నీకు ఎండాకాలం వడగాలిని
నేను చల్లటి మలయమారుతాన్ని
నేనే నీకు కొండలే రగిలే గాలిని
 
నేను నీ హృదయ స్పందనను
నేను నీ శ్వాసను
నేను నీ కన్నుల్లో రూపాన్ని
నేను నీ తనువులో దాగున్న అణువణువును
నీకు రేయిని నేనే
పగలునూ నేనే
నీ సర్వస్వాన్ని నేనే...
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎంతసేపటికీ గొడవలు, వేధింపులు... ఏంటి ఈ జీవితం..? భర్తను మట్టుబెట్టిన భార్య

జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments