Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పార్టీల ఆదాయ వృద్ధి 313 శాతం.. ప్రాంతీయ పార్టీల ఆదాయ వృద్ధి 652 శాతం

ఒక దశాబ్దంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 313 శాతం పెరిగిందని అదే ప్రాంతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 652 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. బీఎస్పీ పార్టీకి అయితే నూటికి నూరు శాతం ఆదాయం తెలియని వనరుల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (05:25 IST)
దేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం 2004-05 2014-15 మధ్యకాలంలో రూ. 11,367 కోట్లకు పెరిగిందని ప్రజాస్వామిక సంస్కరణల సమితి విశ్లేషణ పేర్కొంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీదే సింహభాగమని తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 69 శాతం వరకు గుర్తుతెలీని వర్గాల నుంచే వచ్చింది.

ఒక దశాబ్దంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 313 శాతం పెరిగిందని అదే ప్రాంతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 652 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. బీఎస్పీ పార్టీకి అయితే నూటికి నూరు శాతం ఆదాయం తెలియని వనరుల నుంచే వచ్చంది. ఇదంతా గుర్తు తెలియని వర్గాలు విరాళాల రూపంలోనే వచ్చిందని తెలిసింది. 2004-05 సంవత్సరంలో 5. 19 కోట్ల రూపాయలకుగా ఉన్న బీఎస్పీ ఆదాయం 2014-15 నాటికి రూ. 111.96 కోట్లకు చేరింది. 
 
దేశంలోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 43 శాతం కాంగ్రెస్‌ది కాగా, బీజేపీ రూ. 3,272 కోట్లతో  రెండోస్థానంలో నిలిచింది. కాగా సీపీఎం రూ. 893 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయంలో 83 శాతం (రూ. 3,372.63 కోట్లు), బీజేపీ పార్టీ ఆదాయంలో 65 శాతం (రూ.2,125.91 కోట్లు) గుర్తు తెలియని వర్గాల నుంచి వచ్చిందేనని ఈ అధ్యయనం తెలిపింది.
 
దేశంలోని 51 ప్రాంతీయ పార్టీల్లో 42 పార్టీల ఆదాయ పన్ను రిటర్నులు అందుబాటులో లేవని ఎడీఆర్ తెలిపింది. భూటాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రాజకీయ పార్టీలకు వస్తున్న ఆదాయంలో 75 శాతం వరకు తెలిసిన వనరుల నుంచే రాగా, ఇండియాలో దానికి పూర్తి రివర్సులో జరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments