Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్బా డ్యాన్స్.. 24 గంటల్లో పది మంది గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:43 IST)
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా డ్యాన్స్ చేస్తూ పలువురికి గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితులు యువకులు, మధ్య వయస్కులే కావడం ఆందోళనకరం. బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా మృతుల్లో ఉండటం అందరినీ షాక్‌కు  గురి చేసింది. 
 
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా అదే విధంగా మరణించాడు. నవరాత్రుల మొదటి 6 రోజుల్లో, 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి మొత్తం 521 కాల్‌లు వచ్చాయి. 
 
గర్బా వేడుకల సమయమైన సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య శ్వాస ఆడకపోవడానికి సంబంధించి 609 కాల్స్ వచ్చినట్లు అధికారులు వివరించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ప్రభుత్వంతో పాటు కార్యక్రమ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం స్పందించింది. గర్బా వేడుకలకు సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments