Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులకు సహకరించాడని.. 13ఏళ్ల బాలుడిని శూలాలకు గుచ్చి చంపేశారు..

ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (11:12 IST)
ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరికి చెందిన అరుణ్‌కుమార్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. అతని ఇంటిపక్కనే ఉన్న బంధువు కలైసెల్వి (18).. అదే గ్రామానికి చెందిన అరుళ్‌ (23)తో ప్రేమలో పడింది. వారిద్దరికీ అరుణ్‌ ‘మాట సాయం’ చేస్తున్నట్లు కలైసెల్వి బంధువులకు అనుమానం వచ్చింది. 
 
ఈ విషయం తెలియరావడంతో మంగళవారం సాయంత్రం నుంచి అరుణ్‌కుమార్‌ కనిపించకుండాపోయాడని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వీరమంజేరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మణి ఆండవర్‌ ఆలయ త్రిశూలాలకు అరుణ్‌కుమార్‌ శవం వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన దర్యాప్తులో అతన్ని తానే చంపేశానని కలైసెల్వి సోదరుడు కదివరన్‌ అంగీకరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments