Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ డబ్బు ఇవ్వగానే ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ : కేంద్ర మంత్రి

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (13:55 IST)
భారత రిజర్వు బ్యాంకును డబ్బులు అడిగామని, ఆ నగదు ఇవ్వగానే ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను జమ చేస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథావలే చెప్పుకొచ్చారు. అయితే, రూ.15 లక్షలను ఒకేసారి జమ చేయలేమని దశలవారీగా జమ చేస్తామని తెలిపారు. 
 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో విదేశాల్లో మగ్గుతున్న భారతీయుల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు చొప్పున జమ చేస్తామంటూ నాడు బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. నాలుగున్నరేళ్ళు గడుస్తున్నా ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
వీటిపై కేంద్ర మంత్రి అథావలే స్పందిస్తూ, ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రజలకు ఒక్కసారిగా ఇవ్వడానికి అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని వ్యాఖ్యానించారు. సాయం చేయాలని రిజర్వు బ్యాంకును కోరినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.
 
ఒకవేళ అంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు ముందుకొచ్చినా, ప్రజలకు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయన్నారు. ఒకవేళ తాము అడిగిన నిధులను ఆర్బీఐ ఇస్తే మాత్రం దశల వారీగా రూ.15 లక్షలను డిపాజిట్ చేస్తామని మంత్రి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments