Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. గుబురు చెట్లలోకి ఎత్తుకెళ్లి..?

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (11:45 IST)
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ అత్యాచార ఘటనపై దేశం భగ్గుమంటూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరొకటి జరిగింది. ఈసారి ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల యువతిని గ్యాంప్ రేప్ చేశారు దుర్మార్గులు. 
 
వివరాల్లోకి వెళితే.. జలావున్ జిల్లాలోని ఓరాయ్ టౌన్‌లో ఉన్న ఆస్పత్రికి ఒంటరిగా బయల్దేరింది. ఊరి చివర నుంచి వెళ్తోంది. అదంతా చెట్లు, గుబురు మొక్కలు, తుప్పలతో ఉండే ఏరియా. ఆ సమయంలో చుట్టుపక్కల జనం లేరు. ఎక్కడి నుంచి వచ్చారో గానీ ఇద్దరొచ్చారు. బాలికను చూశారు. వెనకాలే వెళ్లసాగారు. 
 
తన వెనకాల చప్పుడు అవ్వడంతో ఏంటా అని వెనక్కి తిరిగి చూసి ఓ ఇద్దరు కుర్రాళ్లు రావడాన్ని గమనించింది. వాళ్లు కాస్త దూరంగానే ఉండటంతో తన లాగే వాళ్లూ ఏదో పనిమీద వెళ్తున్నారేమో అనుకుంది. కొన్ని క్షణాలకే తన వెనకాల చప్పుడు మరింత పెరిగింది. మరోసారి వెనక్కి తిరిగి చూసింది. షాకైంది. ఆపై బలవంతంగా పట్టుకుని పక్కనున్న గుబురు చెట్లలోకి ఎత్తుకుపోయారు. తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాధితురాలిని అక్కడే వదిలేసిన ఆ ఇద్దరూ... పారిపోయారు. అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె ఏడుస్తూ ఆస్పత్రికి వెళ్లి జరిగినది తన తల్లికి చెప్పింది. అక్కడే ఉన్న డాక్టర్లు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు చేయమన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం