Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం.. యువతిని కాల్చేసిన స్నేహితుడు.. హోటల్, షాపింగ్‌కు తీసుకెళ్లి... ఇంటిముందే?

ఢిల్లీలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడే కాల్పులు జరిపాడు. అదీ ఆమె ఇంటి ముందే ఈ ఘోరం జరిగిపోయింది. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (12:43 IST)
ఢిల్లీలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడే కాల్పులు జరిపాడు. అదీ ఆమె ఇంటి ముందే ఈ ఘోరం జరిగిపోయింది. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది. ఢిల్లీలోని నజఫ్ ఘడ్‌కు చెందిన ఓ యువతి యోగేష్, శుభమ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. 
 
ఆపై షాపింగ్‌కు కూడా వెళ్ళింది. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లిన కుమార్తె ఇంకా ఇంటికి రాలేదని తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కుమార్తె షాపింగ్ చేస్తున్నామని త్వరలోనే ఇంటికి చేరుకొంటామని ఫోనులో చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే యువతిని స్నేహితులు ఇంటి వద్ద దింపారు.
 
కారు నుంచి దిగి యోగేష్‌తో యువతి మాట్లాడుతుండగానే, కారులో కూర్చున్న శుభమ్ అనే వ్యక్తి యువతిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా.. ఇంటికి వచ్చేసిందనుకున్న కుమార్తె కాల్పులకు గురైందని తెలిసి.. ఆ తల్లి బోరున విలపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments