Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నలుగురు.. మంగళవారం 18 మంది.. ఎంపీ సస్పెన్షన్

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (16:18 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ దఫా వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో జీఎస్టీ పన్ను పెంపుదలపై విపక్ష పార్టీలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగుతున్నాయి. అదేసమయంలో ఇరు సభల స్పీకర్లు కూడా కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, సోమవారరం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలు జారీచేశారు.
 
మంగళవారం జీఎస్టీ పన్నును తగ్గించాలని కోరుతూ రాజ్యసభలో ఆందోళనకు దిగిన 18 మంది విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే.
 
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలు, జీఎస్టీ పన్ను పెంపు తదితర ప్రజా సమస్యలపై విపక్షాలు వాయిదా తీర్మాన నోటీసులను ఇస్తూ వస్తున్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కదానిపై చర్చించేందుకు ఇరు సభల స్పీకర్లు అనుమతించడం లేదు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. మొదటివారమంతా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రెండో వారం తొలిరోజైన సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిని వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు సభలో సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వీరిలో 18 మందిని సభ నుంచి సస్పెండ్ చేశారు. గత రెండు రోజుల్లో సస్పెండ్ చేసిన 22 మంది ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments