Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబూ సలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే...

ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు య

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:56 IST)
ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు యావజ్జీవ కారాగారశిక్ష విధించగా, మరో ఇద్దరికి పదేళ్ళ జైలుశిక్షను విధించింది. 
 
అయితే, 257 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ముంబై వరుస పేలుళ్ళ కేసులో కీలక సూత్రధారుల్లో ఒకరైన అబూ సలేంకు ఉరిశిక్ష పడకుండా యావజ్జీవ శిక్ష మాత్రమే పడింది. దీనికి కారణం లేకపోలేదు.  
 
బాంబే వరుస పేలుళ్ళ  తర్వాత నిందితులంతా దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో అబూసలేం పోర్చుగల్ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. ఆపై నటి మోనికా బేడీతో సహజీవనం చేశాడు. వీరిద్దరినీ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేసిన అనంతరం, పోర్చుగల్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత అధికారులు వారిద్దరినీ స్వదేశానికి తీసుకొచ్చారు. 
 
పోర్చుగల్‌‍ దేశ చట్టాల ప్రకారం ఎలాంటి నేరానికైనా మరణదండన అమలు చేయరు. పైగా, అబూసలేంను అప్పగించే వేళ, అతనికి మరణదండన విధించబోమని భారత్ హామీ ఇచ్చింది. ఈ కారణంతోనే అతనికి యావజ్జీవ శిక్షతోనే సరిపెట్టాల్సి వచ్చిందని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వివరించారు. 
 
కాగా 1993లో ముంబై మహా నగరంలో వరు బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1993లో 47 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ కేసును విచారించిన ముంబైలోని టాటా ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. 
 
దోషులుగా తేలిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దల్లా రషిద్‌లకు ఉరిశిక్ష విధించింది. అలాగే అబూ సలేంకు జీవిత ఖైదు విధించింది. ఆయుధాలు సరఫరా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments