Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆ సిరప్ తాగి ముగ్గురు చిన్నారుల మృతి.. కోటి కావాలని డిమాండ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:30 IST)
ఢిల్లీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిరప్ తాగిన పాపానికి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురు వైద్యుల సేవలను రద్దు చేసి, ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.  కానీ ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా చేయాలని, ముగ్గురు పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఇచ్చిన డ్రగ్స్‌ వల్ల ముగ్గురు చిన్నారులు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే ముగ్గురు వైద్యుల సేవలను రద్దు చేసి విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఢిల్లీ ప్రభుత్వం కూడా సోమవారం నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆగ్నేయ ఢిల్లీ) డాక్టర్ గీత ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారు. ఇది ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
 
డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనేది దగ్గును అణిచివేసే మందులలో ఒకటి. ఈ మందును సేవించిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం, మరో 13 మంది పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments