Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిని కుదిపేస్తున్న పిడుగులు... వర్షాలు... 40 మంది మృతి

ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:23 IST)
ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనూ కొనసాగుతున్నాయి.
 
సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 10 మంది మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లో ఆదివారం బలమైన గాలులు, భీకర తుపానుతో పెద్ద ఎత్తున వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. 13 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 17కు చేరింది. అలాగే, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments