Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో భారీ వర్షాలు.. 43మంది మృతి.. రూ.4లక్షల నష్టపరిహారం

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:55 IST)
కేరళను రుతుపవనాలు తాకిన వేళ.. భారీ వర్షాలు 43మందిని పొట్టనబెట్టుకుంది. యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ం కారణంగా ఆదివారం 43మంది ప్రాణాలు కోల్పోయారు. 43మంది మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
 
ఈ క్రమంలో యూపీలోని ఉన్నావ్‌లో 8 మంది, కనౌజ్లో ఐదుగురు మృతి చెందారు. వర్షం ధాటికి లఖ్నవూలో ఓ ఇల్లు నేలమట్టమై ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుసుంభి ప్రాంతంలోనూ ఇల్లు కూలి 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. రాగల 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 50- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments