Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం-మేఘాలయ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత - కాల్పుల్లో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (09:07 IST)
అస్సాం - మేఘాలయ రాష్ట్రా మధ్య మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్కో గ్రామంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కలప స్మగ్లింగ్‌ను అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడమే దీనికి కారణం. 
 
కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా ఐదుగురు మేఘాలయా వాసులు చనిపోయారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 
మంగళవారం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు వాహనాని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో అస్సాం ఫారెస్ట్ గార్డులు ఛేజ్ చేస్తూ కాల్పులు జరపడంతో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మేఘాలయ వాసులు, ఒక అస్సాం ఫారెస్ట్ గార్డు ఉన్నారు. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా అస్సాం - మేఘాలయ మధ్య 884.9 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఇందులో 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments