Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే కార్యకర్త దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Webdunia
శనివారం, 14 మే 2022 (19:22 IST)
తమిళనాడులో డీఎంకే కార్యకర్త హత్యకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నై రాయపురంలోని గ్రేస్ గార్డెన్ మూడో వీధిలోని ఓ ఇంట్లో గోనె సంచిలో డీఎంకే కార్యకర్త చక్రపాణి (65) మృతదేహం కనిపించింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టగా ఓ గోనె సంచిలో మనాలికి చెందిన చక్రపాణి మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు అస్లాం హుస్సేనీ బట్చా (35), అతని భార్య ఎ. తమీమ్ బాను (40)కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 
నాలుగు రోజుల క్రితమే చక్రపాణిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం చక్రపాణి... తమీమ్‌తో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఆ జంట రాయపురానికి వెళ్లిన తర్వాత కూడా అది కొనసాగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో చక్రపాణిని హత్య చేశారని తెలిపారు. అస్లాం హుస్సేనీ సోదరుడు ఎం.వసీం బట్చా కూడా నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నారని చెప్పారు.
 
తమీమ్ మంగళవారం ఉదయం తన ఇంటికి రమ్మని మెసెజ్ చేయగా చక్రపాణి వెళ్లారని అదే సమయంలో తన స్నేహితుడు కె.డిల్లీ బాబుతో కలిసి ఇంటికి వెళ్లిన వసీం... తమీమ్, చక్రపాణీలను చూసి గొడవ పడి.. చక్రపాణిని హత్య చేసినట్టు తాము అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
 
ఈ క్రమంలో వసీం, ఢిల్లీ బాబు పరారీలో ఉండగా.. అస్లాం హుస్సేనీ, తమీమ్ బానులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ జీహెచ్‌కి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments