Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన స్త్రీతో ప్రేమ... రాలేదని ఛాతీపై బ్లేడుతో కోసుకున్నాడు... ఆపై...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:13 IST)
ఈమధ్య పరస్పరం ఇష్టముండి సంబంధం కొనసాగించడం... అదే వివాహేతర సంబంధం అనేది నేరం కాకపోవడంతో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమల్లో మునిగితేలేవారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి ప్రేమల్లోనూ పలు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. తను ప్రేమించిన పెళ్లయిన ప్రియురాలు తను పిలువగానే రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి బ్లేడుతో కోసుకుని బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలో సంగం విహారులోని కేబుల్ ఆఫీసులో లక్ష్మీనారాయణ పనిచేస్తున్నాడు. ఇతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే ఆమెకు కొంతకాలంగా దూరంగా వుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే మరో వివాహితతో సన్నిహితంగా వుంటున్నాడు. ఇది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆదివారం నాడు శెలవు దినం కావడంతో ఆమెను తన గదికి రావాలని ఫోన్ చేశాడు. 
 
ఆమె ఎంతకీ రాకపోవడంతో బ్లేడుతో తన గుండెపై కోసుకుని బీభత్సమైన ఫోటోలను ఆమెకు పంపాడు అలాగైనా వస్తుందని. కానీ ఆమె రాకపోవడంతో అప్పటికే పూటుగా మద్యం సేవించిన నారయణ ఆఫీసులో వుండే కేబుల్ వైర్లను తీసుకుని వాటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments