Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిన్నీ.. ఎమ్మెల్యేలు మాట వినడం లేదు... శశికళతో దినకరన్

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ముప్పుతిప్పలు పెట్టాలని చూసిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:15 IST)
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ముప్పుతిప్పలు పెట్టాలని చూసిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఆయన వర్గం ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు.
 
తనకు జై కొట్టిన 19 ఎమ్మెల్యేలను దినకరన్ పుదుచ్చేరికి తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ రాజకీయాలకు సీఎం ఎడప్పాడి ఏమాత్రం తలొగ్గలేదు. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని దినకరన్ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు. 
 
ఈ నేపథ్యంలో దినకరన్ రిసార్ట్‌లో ఉంచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నేడో రేపో చేజారిపోనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దినకరన్ వారిని కాపాడుకునేందుకు హైదరాబాద్ తరలించనున్నట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.  
 
అదేసమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు దినకరన్ బెంగుళూరు జైలులో ఉన్న శశికళను చూసేందుకు వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శశికళ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించనున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంతో పాటు ప్రస్తుత రాజకీయాలపై శశికళతో ఆయన చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments