Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 4 నుంచి ఎయిర్‌ ఇండియా దేశీయ విమాన సర్వీసులు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:14 IST)
మే 4వ తేది నుంచి దేశీయ విమానాల టికెట్‌ బుకింగ్‌ ప్రకియ ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ  ప్రకటించింది. అయితే మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని.. జూన్‌ 1 నుంచి ఇంటర్నేషనల్‌ బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

కాగా కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించగా.. అత్యవసర సేవలకు మినహా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు సైతం రద్దు అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగుస్తున క్రమంలో ఎయిర్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రతి అప్‌డేట్‌ను అందిస్తుంటామని ఎయిర్‌ ఇండియా తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా అలాగే చైనా వంటి అంతర్జాతీయ మార్గాలకు వైద్య సామాగ్రి తరలింపు కోసం విమాన సర్వీసులను నడుపుతోంది.

దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్‌ ఉడాన్’ విమానాలు నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇక ఈ రోజు(శనివారం) ఉదయం ఎయిర్ ఇండియా బి -787 విమానం ఢిల్లీ నుంచి వైద్య సామాగ్రిని తీసుకొని చైనాకు వెళ్లినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments