Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింస - దృష్టిసారించిన అమిత్ షా

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (14:43 IST)
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలు, హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన విధ్వంసంపై  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అయిన కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా దక్షిణాదికి చేరడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది.
 
వీటికి చెక్ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అగ్నిపథ్ పథకంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా సహా పలువురు కేంద్రం మంత్రులు మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. 
 
కరోనా కారణంగా గత రెండేళ్లలో ఆర్మీ నియామకాలకు ఆటంకం కలిగిందని అమిత్ షా అన్నారు. సైన్యంలో చేరాలనుకునే యువకుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ఏడాది అభ్యర్థుల వయో పరిమితిలో రెండేళ్ల సడలింపు కల్పించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments