శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (08:53 IST)
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్ పడింది. దీంతో యాక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రాకెట్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కావడమే ఈ యాత్రకు బ్రేక్ పడింద. దీనికి మరమ్మతులు చేసిన తర్వాత అంతరిక్ష యాత్రపై కొత్త తేదీని ప్రకటించనున్నారు. 
 
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సివుండగా, ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్రను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.
 
కాగా, ప్రయోగానికి సిద్ధం చేసిన ఫాల్కన్-9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయినట్టు స్పేస్‌ఎక్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. బూస్టర్ టెస్ట్ సమయంలో ఈ సమస్య తలెత్తినట్టు గుర్తించారు. లీకేజీ సమస్య పూర్తిగా పరిష్కరించి, అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రయోగాన్ని చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరమ్మతు పనులకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని, త్వరలోనే కొత్త ప్రయోగ తేదీని అధికారికంగా వెల్లడిస్తామని ప్రకటించింది. 
 
నిజానికి ఈ ప్రయోగం మంగళవారమే జరగాల్సివుంది. అయితే, ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో దీనిని బుధవారానికి వాయిదా వేశారు. తాజాగా ఇపుడు సాంకేతిక కారణాలతో రెండోసారి ప్రయోగం వాయిదాపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments