Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు భరించలేక కొడుకుని ఉరితీసిన తండ్రి.. వీడియో తీసిన కుమార్తె... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (16:09 IST)
అప్పుల బాధను భరించలేక కన్నబిడ్డను ఓ తండ్రి ఉరితీశాడు. దీన్ని అతని కుమార్తె వీడియో తీసింది. అయితే, ఈ దృశ్యాన్ని చూసిన బాధను భరించలేక కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం బెంగుళూరులోని విభూతీ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విభూతీ నగర్‌కు చెందిన సురేశ్ బాబు(43) అనే వ్యక్తి సేల్స్ ఎగ్జిగ్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గీతాభాయి ఇంటి దగ్గరే ఓ కిరాణా షాపును పెట్టుకొని చిట్టీ వ్యాపారం నడుపుతోంది. వీరికి 17 యేళ్ల కుమార్తెతో పాటు వరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. 
 
అయితే ఇటీవల చీటీల లావాదేవీలలో నష్టాలు రావడంతో వారికి డబ్బును ఇచ్చిన వారు గీతాభాయిపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని సురేశ్ కుటుంబం నిర్ణయించుకుంది.
 
ఈ నేపథ్యంలో తొలుత కుమారుడుకి ఉరివేశాడు. దీన్ని కుమార్తె వీడియో తీసింది. ఈ ఘటనను తల్లి కళ్ళారా చూసింది. ఆ తర్వాత ఆ బాధను భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి సురేష్‌ను విచారించారు. ఈ విచారణలో తొలుత తన బిడ్డను చంపిన భార్య.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం లోతుగా ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. 
 
అప్పుల భాధ భరించలేక తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని.. కానీ తన కూతురే తనను కాపాడిందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరోవైపు సురేశ్ కూతురి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments