Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వద్దు... ప్రియుడే ముద్దు : భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య నాటకం

ఇటీవలి కాలంలో ప్రియుళ్ళ మోజులో పడిన భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతోంది. ఇప్పటికే ఓ స్వాతి, ఓ జ్యోతి, ఓ శ్రీవిద్య ఇలా పలువురు ఈ కోవలో ఉన్నారు.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (08:51 IST)
ఇటీవలి కాలంలో ప్రియుళ్ళ మోజులో పడిన భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతోంది. ఇప్పటికే ఓ స్వాతి, ఓ జ్యోతి, ఓ శ్రీవిద్య ఇలా పలువురు ఈ కోవలో ఉన్నారు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడి కోసం భర్తను దూరం చేసుకునేందుకు కాస్త వెరైటీగా సరికొత్త నాటకం ఆడి పోలీసులకు దొరికిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు పరిధిలోని బ్యాటరాయనపురానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 6వ తేదీన పోలీసు స్టేషన్‌కు ఏడుస్తూ వచ్చింది. మూడు నెలల క్రితమే తనకు పెళ్లయిందని, తాను రోడ్డుపై వెళుతుంటే, ఓ కారు ఆపి చిరునామా అడుగుతున్నట్టు నటించి, కారులోకి లాగేశారని, నోరు మూసి, రోజంతా తనను తిప్పుతూ, కారులోనే నలుగురూ తనపై పశువుల్లా పడి అత్యాచారం చేశారని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
ఇక తాను ఇంటికి ఎలా వెళ్లాలని, భర్తతో ఎలా కాపురం చేయాలని వలవలా ఏడ్చింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపగా, ఆమె నెల రోజుల నుంచి అసలు సెక్స్‌లో పాల్గొనలేదన్న తేల్చారు. 
 
ఆపై ఆమె కిడ్నాప్‌కు గురైనట్టు చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే, ఆమె ఎక్కడా కనిపించ లేదు. దీంతో కాస్తంత గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది. తనకు భర్తంటే ఇష్టం లేదని, పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని చెబితే భర్త వదిలేస్తాడన్న ఆలోచనతో ఈ నాటకం ఆడినట్టు చెప్పడంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. భర్తకు విషయం చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం