Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల పిల్లాడిని బెల్టుతో కొట్టాడు.. మంచంపైకి విసిరేశాడు.. కర్కశుడైన కన్నతండ్రి

చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యూషన్‌కు వెళ్లకుండా హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని.. కన్న కుమారుడినే కనికరం లేకుండా ఓ తండ్రి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు.

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (12:21 IST)
చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యూషన్‌కు వెళ్లకుండా హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని.. కన్న కుమారుడినే కనికరం లేకుండా ఓ తండ్రి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. ఆరేళ్ల పిల్లాడిని బెల్టుతో కొట్టడంతో పాటు.. పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా.. ఎత్తు నుంచి మంచంపై విసిరాడు. 
 
మంచంపై నుంచి కిందకేసి కాళ్లతో తొక్కుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులోని కెంగెరిలో చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నా కన్నబిడ్డను తండ్రి చావబాదుతున్నా.. తల్లి మాత్రం వీడియో తీసింది. వివరాల్లోకి వెళితే.. పిల్లాడి తండ్రి ఐటీ కన్సల్టెన్సీలో ఉద్యోగి అని తెలిసింది. నవంబర్ 17, 2017న ఈ ఘటన జరిగింది. అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
 
ఈ వీడియోలో ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. బాలుడి తండ్రి అతని ఫోన్ పాడవడంతో కొద్దిరోజుల క్రితం రిపేర్‌కు ఇచ్చాడు. రిపేర్‌కిచ్చే సమయంలో ఆ వీడియో మొబైల్‌లోనే సేవ్ అయి ఉంది. డిలీట్ చేయలేదు. ఆ ఫోన్‌ను రిపేర్ చేసిన టెక్నీషియన్ అందులో ఉన్న వీడియో చూసి షాకయ్యాడు. ఆ వీడియోను బయటపెట్టడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. 
 
నిందితుడి పేరు మహేంద్ర, పిల్లాడి తల్లి పేరు శిల్పగా పోలీసులు గుర్తించారు. ఇలా కన్నబిడ్డను కొట్టడమే కాకుండా వీడియో ఎందుకు తీశారని అడిగితే.. పిల్లాడు మళ్లీ హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్తే ఈ వీడియోను చూపెట్టేందుకు సేవ్ చేసి వుంచామని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేసి.. పిల్లాడి తండ్రిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments