Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన భార్య, ఉదయం నుంచి ఫోన్లో చాటింగ్, అనుమానంతో భర్త

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (17:28 IST)
మూడుముళ్ల బంధానికి అనుమానం ముల్లు గుచ్చుకుంది. క్షణికావేశం పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. భవిష్యత్తు చీకటిగా మారింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా జీసస్‌నగర్‌లో జరిగింది. కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితను, అదే ప్రాంతానికి చెందిన సంతోష్ 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
 
అనంతపురంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్‌నగర్‌లో స్థిరపడ్డాడు. సంసారం సాఫీగా సాగుతుంది. ఇంతలోనే కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. గత ఏడాదిలో కరోనా వ్యాప్తి చెందటంతో కవిత ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. 
 
ఆరు నెలల తర్వాత భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. తరచూ ఫోనులో మాట్లాడటంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపారు. కానీ భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య ఫోన్లో మెసేజ్‌లు, చాటింగ్‌లు చూసి మరింత కోపంతో ఊగిపోయాడు సంతోష్. లుంగీని గొంతుకు బిగించి చంపేసి అనంతరం పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments