Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లి నిశ్చయం కావడంతో గొంతు కోసేశాడు..

ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (18:27 IST)
ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఘటన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ద‌మ్మ‌పేట మండ‌లం నెమ‌లిపేట‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ప్రేమిస్తున్నానంటూ పల్లవి అనే యువతి వెంట పడుతోన్న శ్రీనివాసరాజు అనే ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. పల్లవి స్థానిక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన యువకుడు చాకుతో ఆమె మెడను కోసేశాడు. 
 
ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఈ దుర్ఘటన సంభవించడంతో విద్యార్థులు భయంతో జడుసుకున్నారు. ఇటీవలే ప‌ల్ల‌వికి వివాహం నిశ్చ‌యం కావ‌డంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.

పక్కా ప్రణాళికతో దాడి చేసిన శ్రీనివాస్.. దారుణానికి ఒడిగట్టడానికే ముందే పురుగుల మందు తాగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవళికను పొడిచి చంపిన కాసేపటికి అతడు కూడా అక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments