Webdunia - Bharat's app for daily news and videos

Install App

బళ్లారి బీజేపీ ఎంపీ గన్‌మెన్ అరెస్ట్.. గాలి జనార్ధన్ రెడ్డికి భయం భయం..

మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి పాతనోట్ల మార్పిడి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో భాగంగా బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు గన్‌మెన్ చెన్న బసప్ప హోసమనిని సీఐడీ అదుపులోకి తీసుక

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (10:10 IST)
మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి పాతనోట్ల మార్పిడి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో భాగంగా బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు గన్‌మెన్ చెన్న బసప్ప హోసమనిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్ కారు డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్ కేసుని సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇప్పటికే నాయక్‌ని విచారించిన అధికారులు అతని సమాచారం మేరకు ఎంపీ గన్‌మెన్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయడం కూడా ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందేమోనని గాలి వర్గీయులు భయంతో హడలిపోతున్నారు. డ్రైవర్ సూసైడ్ చుట్టూనే ఈ కథ తిరుగుతోంది. 
 
కాగా.. గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్ళికి ముందు ఆయనకు సంబంధించిన 100 కోట్ల పాత కరెన్సీని కొత్త నోట్లుగా రెవెన్యూ అధికారి భీమానాయక్ మార్చాడని, దీని నిమిత్తం 20 శాతం కమీషన్‌గా ఆయనకు ముట్టిందని వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో తనను చంపుతామని బెదిరించారని, ఈ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు డ్రైవర్ రమేష్ గౌడ తన లేఖలో ప్రస్తావించడంతో గాలి జనార్ధన్ రెడ్డికి గుబులు మొదలైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments