Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం: నలుగురు మృతి

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:51 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. సోపోర్‌లో సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు ప్రారంభించాయి.
 
కాగా గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్, కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మరోవైపు భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఐఈడీ బాంబులు పెడుతున్నారు. తాజాగా రెండు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. ఇక ఓ తోటలో ఉంచిన 5 కేజీల పేలుడు పదార్దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థం కేసుపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments