Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దోపిడీ మాత్రమే జరిగింది.. : వైద్య పరీక్షల్లో కనిపించని రేప్ ఆనవాళ్లు!

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు

Webdunia
శనివారం, 27 మే 2017 (09:23 IST)
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జేవార్ దోపిడీ, అత్యాచార కేసులో కీలక మలుపు తిరిగింది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వైద్యులు చెపుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఓ కుటుంబానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు... వాహనంలో బులందర్‌షహర్ వెళ్తుండగా, కొందరు దుండగలు అడ్డగించి ఒకరిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుపోగా, నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమ కణతలపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళలు ఆరోపించారు. 
 
అయితే వారికి నిర్వహించిన సూపర్‌మాటోజో పరీక్షలో అత్యాచారానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని వైద్యులు చెబుతుండడం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్‌ఎస్‌పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments