Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వాసనాళంలో బ్లేడు ముక్కలు ... చిన్నపేగులో ప్లాస్టిక్ పుల్ల... నిజమా?

చెన్నైకు చెందిన ఓ యువకుడికి ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ కల్పించారు. శ్వాసనాళంలో చిక్కుకున్న బ్లేడు ముక్కలతోపాటు చిన్న పేగులో ఉన్న ప్లాస్టిక్ పుల్లను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు.

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (15:04 IST)
చెన్నైకు చెందిన ఓ యువకుడికి ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ కల్పించారు. శ్వాసనాళంలో చిక్కుకున్న బ్లేడు ముక్కలతోపాటు చిన్న పేగులో ఉన్న ప్లాస్టిక్ పుల్లను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నై శివారు ప్రాంతమైన కార్నాడైకు చెందిన కాళిదాస్‌(25) ఓ మతిస్థిమితంలేని యువకుడు. ఇటీవల అతడికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో తల్లిద్రండులు అతడిని చెన్నై నగరంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కాళిదాస్‌కు వైద్యనిపుణులు అల్ట్రాసౌండ్ స్కాన్‌, సీటీ స్కాన్‌ చేశారు. 
 
ఇందులో అతడి చిన్న పేగులో 12 సెంటీమీటర్ల పొడవున్న ప్లాస్టిక్‌ పుల్ల, కుడివైపు శ్వాసనాళంలో రెండు బ్లేడు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే వైద్య నిపుణుల బృందం అతడికి రెండు రోజులపాటు కృత్రిమశ్వాస అందించి మూడు ఆపరేషన్ల చేసి శ్వాసనాళంలోని బ్లేడు ముక్కలను, చిన్నపేగులోని ప్లాస్టిక్‌ పుల్లను తొలగించారు.
 
కాళిదాస్‌ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ పొన్నంబళం నమశ్శివాయం తెలిపారు. ఈ ఆపరేషన్‌లకు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యేవని, తాము ముఖ్యమంత్రి ఆరోగ్య భీమా పథకం కింద కాళిదాస్‌కు శస్త్రచికిత్సలు చేశామని ఆయన వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments