Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. ఉరిశిక్ష రద్దు.. జీవితాంతం జైలులోనే వుండాల్సిందే

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:37 IST)
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెడుతూ తీర్పు ఇచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం(2019) కోయంబత్తూరు కుడిమలూరులో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం అయ్యింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ అదృశ్యమైందో అక్కడే ఆ బాలిక మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. ఆ బాలికపై అత్యాచారం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కిరాతకానికి పాల్పడింది బాలిక ఇంటి పక్కనే ఉన్న సంతోష్‌కుమార్‌(34) అని విచారణలో తేలింది. పోలీసులు సంతోష్ ని అరెస్టు చేశారు.
 
ఈ కేసును విచారించిన కోయంబత్తూరు కోర్టు.. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు ధ్రువీకరణకు హైకోర్టుకు కింది కోర్టు నుంచి పంపారు. అదే సమయంలో సంతోష్‌కుమార్‌ అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తులు పీఎన్‌ ప్రకాష్, శివజ్ఞానం బెంచ్‌ కేసుని విచారిస్తూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో బుధవారం(ఏప్రిల్ 28,2021) తీర్పు ఇచ్చింది.
 
ఉరి రద్దు..
నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన శిక్షను హైకోర్టు ధ్రువీకరించింది. పోక్సో చట్టంలో అరెస్టులను ధ్రువీకరిస్తూ, నిందితుడికి రూ. లక్ష జరిమానా విధించింది. అయితే, ఇటీవల కాలంగా కొన్ని కేసుల తీర్పుల్లో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలను గుర్తు చేస్తూ, నిందితుడికి విధించిన ఉరి శిక్షను రద్దు చేశారు. ఈ శిక్షను యావజ్జీవంగా మార్చారు. 
 
యావజ్జీవ కాలం ముగిసినా, 25 సంవత్సరాల వరకు విడుదల చేసేందుకు వీలు లేదని తీర్పులో బెంచ్‌ స్పష్టం చేసింది. అలాగే శిక్ష తగ్గింపునకు సైతం ఆస్కారం లేదని, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments