Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌: భారత్‌లో తగ్గిన జీవితకాలం

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (16:31 IST)
కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రజల జీవితకాలం రెండేళ్లు తగ్గినట్లు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్డడీస్‌ తెలిపింది. దేశ ప్రజల ఆయురార్దం సగటు రెండేళ్లు తగ్గినట్లు తన రిపోర్ట్‌లో ఆ సంస్థ వెల్లడించింది.
 
కరోనా వైరస్‌ విజృంభణతో ఆడ, మగ వారిలో ఆయుష్షు తగ్గినట్లు ఐఐపీఎస్‌ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ తెలిపారు. బీఎంసీ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో దీనికి సంబంధించిన నివేదికను పబ్లిష్ చేశారు. 
 
కరోనా వైరస్‌ విజృంభించక ముందు దేశంలో పురుషుల జీవిత కాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారి జీవితకాలం 72 ఏళ్లుగా ఉంది. 2020లో కరోనా విజృంభణతో 35 నుంచి 79 ఏళ్ల వయస్సున్న వారిలో ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. దీని కారణంగానే జీవితకాలం తగ్గినట్లు తెలుస్తోందని ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ తెలిపారు.
 
దీంతో పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు జీవితకాలం చేరినట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 145 దేశాల గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్ డిసీజ్‌, కోవిడ్‌ ఇండియా అప్లికేషన్‌ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్‌ పోర్టల్‌ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఐఐపీఎస్‌ తన నివేదికను తయారు చేసింది. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మార్చి 2020 నుండి కరోనా కారణంగా 4.5 లక్షల మంది మరణించారు. ''కోవిడ్‌ ప్రభావం ఆయుర్దారాన్ని పెంచడానికి తాము గత దశాబ్ద కాలంగా సాధించిన పురోగతిని తుడిచిపెట్టేసిందని'' యాదవ్‌ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments