Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో మరో ఒమిక్రాన్ కేసు - మూడుకు చేరిన మొత్తం కేసులు

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (16:13 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ క్రమంగా పాగా వేస్తోంది. ఆదివారం ఒక్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కర్నాటకలో మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. అయితే, కర్నాటకలో ఆదివారం నమోదైన కేసుతో కలుపుకుని మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. 
 
మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా కర్నాటకలోనే నమోదైన విషయం తెల్సిందే. సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ తొలుత వెలుగుచూసింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో నమోదైన మూడో కేసు కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలోనే వెలుగు చూడటం గమనార్హం. ఇదే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నుంచి ఐదు ప్రాథమిక కాంటాక్టులను, 15 సెకంటరీ కాంటాక్టులను గుర్తించామని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments