Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీ-గ్యాంగ్ చేతిలో హతం కానున్న హైదరాబాద్ సెలెబ్రిటీ ఎవరు?

మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ మోస్ట్ సెలెబ్రిటీని హత్య చేసేందుకు హైదరాబాద్‌లో సంచరిస్తుందట.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (16:05 IST)
మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ మోస్ట్ సెలెబ్రిటీని హత్య చేసేందుకు హైదరాబాద్‌లో సంచరిస్తుందట. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు ఉప్పందించారట. ఈ వార్త హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. 
 
ఇటీవల ఢిల్లీలో షార్ప్ షూటర్ నసీంను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో కొంతమంది సెలబ్రిటీలను చంపడానికి జరిగిన కుట్ర వెనుక దావూద్ హస్తమున్నట్లు సమాచారం. 
 
ముఖ్యంగా, హైదరాబాద్‌లోని ఓ సెలబ్రిటీతోపాటు మరికొంతమంది సెలబ్రిటీలను చంపడానికి దావూద్, షకీల్ ఆదేశాలతో రంగంలోకి దిగానని విచారణలో నసీం పోలీసులకు చెప్పాడు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులను అప్రమత్తం చేసి సెలెబ్రిటీల భద్రతపై ఓ కన్నేసివుంచాలని హెచ్చరించారట.
 
కాగా, ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తుండగా, ఇటీవల అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments