Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లి మోసపోయిన యువకుడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (14:38 IST)
ఓ యాప్‍‌‌ ద్వారా బుక్ చేసుకున్న యువతితో డేటింగ్‌కు వెళ్లిన ఓ యువకుడు అన్ని విధాలుగా మోసపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హస్తినకు చెందిన అర్చిత్ గుప్తా అనే వ్యక్తి బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయితో కలిసి రాజౌరీ గార్డెన్‌లోని బార్‌కు వెళ్లాడు. అక్కడ ఆ అమ్మాయితో మాటలు కలిపాడు. చివరకు అతను మోసం పోయాడు. 
 
ఆ తర్వాత తనకు జరిగిన మోసాన్ని అర్చిత్ గుప్తా ఇలా రాసుకొచ్చాడు. 'మేం ఇద్దరం కలిసి ఓ బార్‌కు వెళ్లాం. 2-3 గ్లాసుల డ్రింక్స్, వైన్, వోడ్కా, చికెన్ టిక్కా, వాటర్ బాటల్ తీసుకున్నాం. తీరా రూ.15,886 బిల్ చూసేసరికి షాక్ అయ్యాను. ఇక చేసేదేమీ లేక బిల్ కట్టి వాష్‌రూమ్‌కు వెళ్లాను. తిరిగొచ్చే సరికి టేబుల్ పైన బిల్లు లేదు. అక్కడ ఆ అమ్మాయీ లేదు. నాకేమీ అర్థం కాలేదు. తర్వాత ఆమెకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. తర్వాత యాప్‌లో వెతికితే ఆమె ఖాతా కనపడలేదు. అప్పుడు అర్థం అయింది నేను మోసపోయానని' అంటూ అర్చిత్ విషయాన్ని తెలిపాడు.
 
ఈ క్లబ్‌, బార్లు అమ్మాయిల సాయంతో ఇలాంటి మోసాలు చేస్తున్నాయని అర్చిత్ గుప్తా పోస్టులో పేర్కొన్నాడు. తాను అర్డర్ చేసిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని చెల్లించానని తెలిపాడు. ఈ తరహా మోసాలు జరగడం ఇదేం మొదటి సారి కాదు. ఇలా డేటింగ్ యాప్‌ల మాటున అబ్బాయిలను పరిచయం చేసుకొని హోటళ్లకే తీసుకెళ్లి డబ్బులు దోచుకున్న సందర్భాలున్నాయి. సెప్టెంబరులోనే ఓ వ్యక్తి ఇలానే అమ్మాయితో కలసి హోటల్‌కు వెళ్లి రూ.14 వేల వరకు మోసపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments