Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీర్‌ను పక్కనబెట్టిన దీప.. భర్తతో విబేధాలు.. పార్టీ సంగతేంటి?

దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు నడిరోడ్డుకు వచ్చేశాయి. అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం లేకపోవడంతో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నా ఫలితం లేకపోయింది. పన్నీరుచే రాజీనామా చేయించి.. తాను

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:31 IST)
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు నడిరోడ్డుకు వచ్చేశాయి. అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం లేకపోవడంతో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఉన్నా ఫలితం లేకపోయింది. పన్నీరుచే రాజీనామా చేయించి.. తాను సీఎం కావాలనుకున్న అమ్మ నెచ్చెలి శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో జయలలిత వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన దీప.. అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని అందరూ అనుకున్నారు. 
 
కానీ దీప, ఆమె భర్తల మధ్య ఏర్పడిన విభేదాలతో ఆమె స్థాపించిన పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. సొంతంగా ఎంజీఆర్ అమ్మ పేరవైని స్థాపించిన దీప.. పన్నీరుకు దూరమైన సంగతి తెలిసిందే. కానీ పన్నీరును పక్కనబెట్టి.. తన భర్తతో పార్టీని ముందుకు తీసుకెళ్లిన దీప.. భర్త నుంచే వ్యతిరేకత రావడంతో దిక్కుతోచక తలపట్టుకున్నారు. 
 
దీప పేరవైలో తాను చెప్పిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదన్న కారణంగా మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కలిశారు. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నిక  సందర్భంగా నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మరోమారు ఆగ్రహానికి గురిచేసింది.
 
కాగా, శుక్రవారం దీప ఇంటి ముందు నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దీప, మాధవన్ దంపతుల మధ్య మరోమారు విభేదాలు పొడచూపాయి. ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచె కట్టుకున్న మాధవన్ అనుచరులను అంబేద్కర్ జయంతి వేడుకలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో దీపకు ఆమె భర్తకు మధ్య విబేధాలు గుప్పుమన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments