Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి కంట్లో కారం కొట్టి.. గ్రైండర్ రాయితో హతమార్చిన కూతురు.. వాలెంటైన్స్ డే రోజున?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (17:29 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ తల్లిని కుమార్తె హత్య చేసింది. అదీ ప్రేమికుడిలో కలిసి కన్నతల్లి కంట్లో కారం కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా పోలీస్ అధికారికే ఈ ఘోరం జరిగింది. ఈమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె వుంది. 
 
ఈమెకు పక్కింట్లో వున్న జితేంద్ర (19) అనే వ్యక్తితో ప్రేమ చిగురించింది. తన కుమార్తె ప్రేమాయణం గురించి తెలుసుకున్న మహిళా పోలీస్ అధికారి కూతురిని మందలించింది. ఇంకా ఆమెను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆవేశానికి గురైన పదో తరగతి బాలిక.. ప్రేమికుడితో కలిసి.. కన్నతల్లినే చంపేసింది. కన్నతల్లి ముఖంపై కారం కొట్టి.. ఆపై ప్రేమికుడితో కలిసి.. గ్రైండర్ రాయితో కొట్టి హతమార్చింది. 
 
ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో జితేంద్ర, పదో తరగతి బాలికనే నిందితులని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments