Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి యత్నించాడు.. అంతే... బాలుడిని కొట్టి చంపేశారు..

సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుక

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ దొరికిన ఓ పిల్లాడిని (16) కట్టేసి చావగొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక ఆ బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ముకుంద్ పూర్లో ఉంటున్న ఓ బాలుడు మరో ఇద్దరితో కలసి మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీచేసేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా ఈ ఇంట్లో ఉన్నవారు ఈ పిల్లాడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఇది తెలుసుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు రాత్రంతా ఈ బాలుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం ఉదయాన్నే రోడ్డుపై పడేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి బంధువులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సిందిపోయి ఇలా దాడి చేయడం ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments