Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనటే వెళుతున్నా... ఎక్కండి దింపుతా అన్నాడు... నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్

బాగా తెలిసిన వ్యక్తే కదా... అతడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. అలా ఏమరుపాటుగా వున్నందుకు ఐదుగురు కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... తూర్పు ఢిల్లీలో ఓ బీపీఓ సెంటర్లో 28 ఏళ్ల యువతి పనిచేస్తోంది. పని ము

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (14:31 IST)
బాగా తెలిసిన వ్యక్తే కదా... అతడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. అలా ఏమరుపాటుగా వున్నందుకు ఐదుగురు కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... తూర్పు ఢిల్లీలో ఓ బీపీఓ సెంటర్లో 28 ఏళ్ల యువతి పనిచేస్తోంది. పని ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఆమె అలా బయటకు కాలు పెట్టగానే తెలిసిన వ్యక్తి కారును డ్రైవ్ చేస్తూ... నేనూ అటే వెళుతున్నాను... ఎక్కండి దింపుతాను అన్నాడు. 
 
బాగా తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి అతడి కారులో ఎక్కగానే లోపల అప్పటికే మరో ఇద్దరు మగాళ్లున్నారు. దాంతో ఆమె మనసు ఏదో కీడు శంకించి కారు దిగబోగా.... వీళ్లు ఇక్కడే పక్కనే దిగిపోతారు.. అంటూ ఆమెను నమ్మించాడు. ఐతే ఆమె అనుకున్న అపాయం జరగనే జరిగింది. ఆమెను ముగ్గురూ బలవంతంగా ఓ అపార్టుమెంటుకు లాక్కెళ్లారు. వారికి మరో ఇద్దరు కామాంధులు తోడయ్యారు. 
 
శనివారం రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహ కోల్పోగానే ఆమెను గదిలోనే బంధించి గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే తిరిగి గదికి రాగానే అప్పటికే స్పృహలోకి వచ్చిన ఆమె, కామాంధులు తలుపులు తీయగానే బాల్కనీలోని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దెబ్బలు తగిలినా తేరుకుని పరుగు పెట్టి సమీపంలో వున్న పోలీస్ స్టేషనులో తనపై జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం